Electronics ITEMS

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం

                  ఓం శ్రీ గణపతేనమః


వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, 

నిర్విఘ్నం కురుమేదేవా సర్వ కార్యేషు సర్వదా:


Image courtesy  http://www.mandirinfo.com/


భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందుకు కారణం ఆ ఆది దేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండటమే. దేశంలో మరెక్కడా ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పుకోవడానికి వీలు కాదు. మరి అలాంటి దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.


బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం :


విశిష్టమైన ఈ గణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు అనే గ్రామంలో ఉంది. అత్యంత శక్తిమంతుడిగా పేరొందించిన ఈ వినయకుడు స్వయంభువుడు. అంటే భూమి నుంచి తనంత తానుగా జన్మించినవాడని అర్థం.

ఈ వినాయకుడి మహిమలు తెలిసి క్రీస్తుశకం 840లో చాలుక్యులు ఈ వినాయకుడికి సుందరమైన దేవాలయాన్ని నిర్మించారని స్థానిక రాతిశాసనాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక కథనాన్ని అనుసరించి ఈ దేవాలయం మొదట్లో భూమిలోకి కూరుకుపోయి ఉండేదని చెబుతారు.

ఒకరోజు స్వామివారు నేరుగా ఒక భక్తుడి కలలోకి వచ్చి తాను ఉన్న చోటును వివరించాడు. అటు పై ఆ భక్తుడు ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా భక్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఈ విగ్రహాన్ని వెలికి తీసినట్లు చెబుతారు.


ఇక భూమి నుంచి బయటికి వచ్చిన ఈ దేవాలయం రోజురోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉండేది. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం కుడివైపునకు ఉంటుంది.

ఇది చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామి వారి చెవిలో చెబుతారు. అటు పై ముడుపులు కట్టుకొంటారు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరని తమ కోర్కెలు నెరవేరుతాయాని భక్తుల నమ్మకం. ఇందుకు సంబంధించిన అనేక నిదర్శనాలను చూపిస్తారు.


అందుకే ఇక్కడ గణపతి హోమం జరిపించడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం నెల ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకొంటారు.





Post a Comment

0 Comments